విద్యార్థి చెంప వాయించిన హిమాచల్ ప్రదేశ్‌ డిప్యూటీ స్పీకర్

Telugu Lo Computer
0


హిమాచల్‌ ప్రదేశ్‌, చంబా జిల్లాలోని చురా అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అయిన హన్స్ రాజ్ గురువారం రైలాలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అనారోగ్యంతో ఉన్నట్లుగా తాను కనిపిస్తున్నానా అని విద్యార్థులను అడిగారు. దీంతో ఒక విద్యార్థి నవ్వడాన్ని హన్స్‌ రాజ్‌ గమనించారు. 'ఎందుకు నవ్వుతున్నావు?' అని ప్రశ్నించారు. ఆ విద్యార్థి వద్దకు వెళ్లి చెంపపై కొట్టారు. ఆ శబ్దం క్లాస్‌లోని అందరికీ వినిపించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ దీనిపై మండిపడ్డారు. ఈ సంఘటన దురదృష్టకరమని అన్నారు. ముస్లిం విద్యార్థి చెంపపై కొట్టిన డిప్యూటీ స్పీకర్‌ హన్స్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు విద్యార్థి తండ్రి రియాజ్ మహ్మద్ దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. డిప్యూటీ స్పీకర్‌ హన్స్ రాజ్‌ తన కుమారుడ్ని కొట్టలేదన్నారు. ప్రేమ, ఆప్యాయతతో చెంపపై తట్టారని అన్నారు. కొందరు దుర్దుదేశంతో దీనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారంటూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే కెమేరాకు పక్కన ఉన్న వ్యక్తి ఈ మేరకు విద్యార్థి తండ్రితో చెప్పించినట్లుగా అందులో కనిపిస్తున్నది. డిప్యూటీ స్పీకర్‌ హన్స్ రాజ్‌ ఈ వీడియోను తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)