బొప్పాయి - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


బొప్పాయి పండు మాత్రమే కాదు బొప్పాయి ఆకులు కూడా అద్భుతమైన లాభాలునిస్తాయి. బొప్పాయి పండ్లను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బొప్పాయి ఆకుల రసాన్ని రోజూ తాగితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆకుల రసాన్ని రోజుకి 3 సార్లు తీసుకుంటే చాలా సమస్యలకు దూరంగా ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు కూడా బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవచ్చు. బొప్పాయి ఆకులు కానీ బొప్పాయి పండు కానీ తీసుకుంటే అజీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, బ్లోటింగ్, గుండెల్లో మంట వంటి సమస్యలు ఉండవు. బొప్పాయి ఆకుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. జీర్ణ ప్రక్రియ సక్రంగా జరిగేటట్టు చూస్తుంది. బొప్పాయి ని తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా అందుతాయి. బొప్పాయి ఆకులు మరియు పండ్లుని హెయిర్ మాస్క్ కింద ఉపయోగిస్తే కూడా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. దీని వలన విటమిన్-ఈ అందుతుంది. అలానే ఫ్లెవనాయిడ్స్ కూడా అందుతాయి. యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి చర్మంపై ర్యాషెస్ కలిగినా మోకాళ్ళ నొప్పులు వంటివి వాటిని తొలగిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయి ఆకులను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. బొప్పాయి ఆకుల తీసుకుంటే డెంగ్యూ కూడా తగ్గుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)