ఉరిశిక్ష పడడం చారిత్రకమైన తీర్పు !

Telugu Lo Computer
0


విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష పడడం చారిత్రకమైన తీర్పు అని అన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్డు తీర్పును స్వాగతిస్తున్నామని, ఈ హత్య కేసులో పోలీసుల పనితీరు బావుందని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 15వ తేదీన గుంటూరులో బీటెక్‌ విద్యార్థిని రమ్యని కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈకేసులో పోలీసులు కేవలం హత్య జరిగిన 10 గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్‌ చేశారన్నారు. సీసీ కెమెరాలో విజువల్స్‌ రికార్డ్‌ అయ్యాయని, వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపితే కేవలం రెండు రోజుల్లోనే నివేదిక ఇచ్చారన్నారు. అంతేకాకుండా హత్య జరిగిన 24 గంటల్లోనే ఛార్జిషీట్‌ దాఖలు చేశామన్నారు. కేవలంలో ఏడాదిలోపే ప్రత్యేక న్యాయస్థానం నింధితుడికి సరైన శిక్ష విధించిందన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే మృగాలకు ఈశిక్షతో వణుకుపుట్టాలన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ చట్టాన్ని రూపొందించి, కేంద్రానికి పంపామమన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో దిశ పొలీస్‌ స్టేషన్లు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని చోట్లా తగిన సిబ్బందిని కూడా నియమించామన్నారు. ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా ఈచర్యలన్నీ సీఎం వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారన్నారు. ఒక దిశ యాప్‌ ద్వారానే ఆపద సమయంలో దాదాపు 900 మంది అమ్మాయిలను రక్షించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.24 కోట్ల మంది దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. రమ్య కేసు పూర్తిగా దిశ చట్టం స్ఫూర్తితోనే జరిగిందన్నారు. ఈ తీర్పు ఇప్పుడు దిశ చట్టం అవసరాన్ని మరింత గుర్తు చేస్తోందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)