పుస్తకం పట్టగానే నిద్ర వస్తుందా ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 14 April 2022

పుస్తకం పట్టగానే నిద్ర వస్తుందా ?


కొంతమందికి చదివేటప్పుడు అకస్మాత్తుగా నిద్రరావడం, కునుకు, తూలిపోవడం లాంటివి ప్రారంభమవుతాయి. దీని వల్ల చదువుపై చెడు ప్రభావం పడటమే కాకుండా నిద్రపై నియంత్రణ కూడా కోల్పోతారు. మన శరీరానికి తగినంత నిద్ర అవసరం. అప్పుడే చలాకీగా ఆరోగ్యంగా ఉండగలం. కానీ చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంటే కొన్ని సులభమైన పద్ధతులు పాటించడం ద్వారా నిద్ర నుంచి దూరంగా ఉండవచ్చు. చదువుతున్నప్పుడు ఒక కప్పు కాఫీ తీసుకొని అప్పుడప్పుడు సిప్ తీసుకోండి. కాఫీలో కెఫీన్ ఉంటుంది. దీనిని ఎనర్జీ బూస్టర్ అని కూడా అంటారు. ఇది కాకుండా, మీరు చాక్లెట్ టీ, ఎనర్జీ డ్రింక్స్ మొదలైనవాటిని కూడా తీసుకోవచ్చు, అయితే ఇవన్నీ పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. పూర్తిగా సౌకర్యంతో మీ నడుమును దిండుపై వాల్చి మంచిగా వెలుతురు లేకుండా చదువుకుంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. చదువుతున్నప్పుడు మీ చుట్టూ ఉన్న కాంతిపై కూడా పూర్తి శ్రద్ధ వహించండి. ఇలా చేయడం ద్వారా శరీరంలోని మెలటోనిన్ అనే హార్మోన్ చురుగ్గా ఉంటుంది. దీంతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. చదువుకునేటప్పుడు నిద్రపోతున్నట్లు అనిపిస్తే ఏదైనా మీకు ఇష్టమైన పాట ప్లే చేసి కాసేపు వినండి. ఇలా చేయడం ద్వారా శ్రద్ధ మరొక వైపుకు వెళుతుంది. మీ మానసిక స్థితి కూడా బాగుంటుంది. అటువంటి పరిస్థితిలో పాటలు వినడం వల్ల నిద్ర నుంచి బయటపడటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిద్రలేమి నుంచి ఉపశమనానికి గోరువెచ్చని నీరు లేదా చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది. కొన్నిసార్లు అలసట కారణంగా చదవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు. నిద్ర ప్రారంభమవుతుంది. తలస్నానం చేస్తే నిద్ర రాదు. పదే పదే నిద్ర వస్తుంటే, చదువుకోవాలని అనిపించకపోతే ఒత్తిడికి గురికాకుండా కాసేపు నిద్రపోండి. ఇలాచేస్తే కాసేపట్లో మీరు రిఫ్రెష్ కావొచ్చు. ఆ తర్వాత చదువుకోవాలని అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మనసు మరింత చురుగ్గా ఉంటుంది. కొన్నిసార్లు నిద్ర లేనప్పుడు కూడా ఇలా జరుగుతుంది. ఎప్పుడూ కూడా తగినంత నిద్ర పొవడం చాలా అవసరం. నిద్రలేమి కూడా అనేక వ్యాధులకు దారి తీస్తుంది.

No comments:

Post a Comment