ముఖంపై ముడతలకి బాదం నూనెతో చెక్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 14 April 2022

ముఖంపై ముడతలకి బాదం నూనెతో చెక్ !


జీవన విధానం, ఆహారపు అలవాట్లు, కాలుష్యం మొదలగు కారణాల వల్ల చాలామంది ముడతల సమస్యని ఎదుర్కొంటున్నారు. వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో చాలా బ్యూటీ ప్రొడక్ట్స్‌ ఉన్నాయి. కానీ వీటిని వాడటం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే కొంచెం ఆలస్యమైనా ఫలితం కచ్చితంగా ఉంటుంది. బాదం నూనెతో ముడతల సమస్యకి చెక్ పెట్టవచ్చు. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల అనేక చర్మ సమస్యలని తగ్గించుకోవచ్చు. ముఖాన్ని కాంతివంతంగా తయారుచేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల చర్మంపై పాత మచ్చలు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి. దీని కారణంగా ఆక్సిజన్ కణాలకు బాగా చేరుకుంటుంది. విటమిన్ ఎ, విటమిన్ ఈ, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, జింక్ వంటి కొన్ని ప్రత్యేక పోషకాలు బాదం నూనెలో ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. దీంతో పాటు అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు కాటన్‌లో కొన్ని చుక్కల బాదం నూనె వేసి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం మీద మొటిమలు సమస్యతో ఇబ్బంది పడే వారు చర్మ సంరక్షణలో భాగంగా బాదం నూనెను ఉపయోగించాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. చాలా సార్లు నిద్ర లేకపోవడం, ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో రాత్రి పడుకునే ముందు బాదం నూనెలో కొద్దిగా రోజ్ వాటర్ లేదా తేనె కలిపి రాసుకుంటే నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చు. ముఖంపై ముడతలు వృద్ధాప్య లక్షణం. కాబట్టి బాదం నూనెలో కొబ్బరి నూనె, అలోవెరా జెల్‌ని కలిపి అప్లై చేయడం ద్వారా ముడతలని తొలగించవచ్చు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనెను చర్మానికి రాసుకోవచ్చు. ముందుగా ముఖాన్ని కడిగి ఆరిన తర్వాత అరచేతులపై కొన్ని చుక్కల బాదం నూనెను వేసుకొని ముఖానికి పట్టించాలి. అనంతరం తేలికపాటి మసాజ్ చేయాలి.


No comments:

Post a Comment