రాత్రికి రాత్రే ఏడున్నర కోట్లు !

Telugu Lo Computer
0


దుబాయ్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో మార్కస్ అనే జర్మన్ దేశస్థుడికి ఏకంగా 1మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. మార్చి 19వ తేదీన అతడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన మిలీనియం మిలియనీర్ సిరీస్ 386, లాటరీ టికెట్ నం.1653 మార్కస్‌కు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దీంతో రాత్రికి రాత్రే అతడి బ్యాంక్ ఖాతాలోకి రూ.7.60కోట్లు వచ్చిపడ్డాయి. అంతే.. అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంత భారీ మొత్తం గెలుస్తానని కలలో కూడా ఊహించలేదని మార్కస్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. కాగా, 1999లో ప్రారంభమైన మిలీనియం మిలియనీర్‌లో 1మిలియన్ డాలర్లు గెలుచుకున్న జర్మన్ వ్యక్తుల్లో మార్కస్ ఎనిమిదో వాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)