వృద్ధురాలి సమయస్ఫూర్తి

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్, ఎటా జిల్లా, అవాఘడ్ మండలం, గులేరియా గ్రామంలో రోజులానే పొలానికి వెళుతున్న ఈ వృద్ధురాలికి రైలు పట్టా విరిగి ఉండడం కనిపించింది. దీంతో ఒక్కసారిగా అవాక్కయింది. ఈ విషయం ఎలాగైనా అధికారులకు చెప్పాలనుకుంది. అయితే చేతిలో ఫోన్ లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి ట్రైన్ వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎలాగైనా వందల మంది ప్రాణాలు కాపాడల్సిందే అనుకుంటున్న తరుణంలో రైలు కూత వినిపించింది. ఆ భయంలోంచి వచ్చిన ఆలోచనే అందరి ప్రాణాలు కాపాడింది. తన వంటిపై ఉన్న ఎర్రచీర సాయంతో రైలును ఆపేసింది. సమయస్ఫూర్తిగా అక్కడే ఉన్న చెట్టు కొమ్మలు విరగ్గొట్టి పట్టాలకు అడ్డంగా తన ఒంటిపై ఉన్న  ఎర్ర చీరను కట్టింది. ఇది గమనించిన ట్రైన్ డ్రైవర్ అనుమానంతో బ్రేక్ వేశారు. కిందికి దిగి చూడగా పక్కనే ఉన్న వృద్ధురాలు ఓంవతీ దేవి పట్టా విరిగిన విషయాన్ని చెప్పింది. వెంటనే డ్రైవర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వృద్ధురాలు లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని రైలు డ్రైవర్‌తోపాటు ప్రయాణీకులు, గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)