పందులపై నిషేధం

Telugu Lo Computer
0


మిజోరం ప్రభుత్వం దిగుమతి చేసుకునే పందులు, వాటి ఉత్పత్తులపై నిషేధం విధించింది. బతికున్న పందులు, మాంసం, ఇతర ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మరోసారి ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పందులను పెంచే చోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ సూచించింది. పరిసరాల్లో తరచూ క్రిమిసంహారక మందులను చల్లాలని ఆదేశించింది. 2020 ఆగస్టులో పందులు, వాటి ఉత్పత్తుల దిగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే గత డిసెంబర్‌ నుంచి కొత్తగా ఏఎస్‌ఎఫ్‌ కేసులు నమోదు కాకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న దానిని ఎత్తివేసింది. ఈ వ్యాధితో గతేడాది 384 పందులు చనిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహా మరణాలు ఐదు జిల్లాల్లో ఇప్పటి వరకు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)