లంకలో సోషల్ మీడియాపై నిషేధం !

Telugu Lo Computer
0


శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు లంక ప్రభుత్వం శనివారం సాయంత్రం 6గంటల నుంచి 36గంటల పాటు అత్యవసర పరిస్థితి విధించింది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించినట్లు ఆదివారం అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, య్యూటూబ్ సహా ఇతర సామాజిక మాధ్యమాలు శనివారం అర్థరాత్రి దాటిన తరువాత నిలిచిపోయాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)