నారీమణులకు అవార్డుల ప్రదానోత్సవం

Telugu Lo Computer
0


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో సేవలందించిన మహిళలకు  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌ వేదికగా నారీ శక్తి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు ప్రధాని, పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. మహిళా సాధికారత కోసం పనిచేసినందుకు గానూ పురస్కారాలు అందజేయనున్నామని 2020, 2021 సంవత్సరాల్లో 28 మంది మహిళలను నారీ శక్తి అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. గతేడాది కోవిడ్ కారణంగా నారీ శక్తి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగకపోవడంతో ప్రస్తుత ఏడాది రెండు సంవత్సరాల అవార్డులను అందజేయనున్నారు. 2020(14), 2021(14) మంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలకు దక్కనున్నాయి. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అనంతరం నారీ శక్తి పురస్కార గ్రహితలతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 2021కి గానూ ఏపీ నుంచి భాషావేత్త, ఆంధ్రా యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ సత్తుపటి ప్రసన్నకు నారీ శక్తి అవార్డు దక్కనుంది. వృత్తి జీవితంలో ఎక్కువ సమయం ఆయా భాషల సంరక్షణకే ప్రాధాన్యం ఇచ్చారు సత్తుపాటి ప్రసన్న. మైనారిటీ గిరిజన భాషలను సంరక్షించినందుకు గాను సత్తుపటి ప్రసన్నకు నారీ శక్తి అవార్డు అందజేయనున్నారు. కుపియా, కోయ, లింగువా పోర్జా, జటాపు, కొండదొర, గడబ, కోలం, గోండి, లింగువా కొటియా, సవర, కుర్రు, సుగాలి, లింగువా గౌడు, ముఖధోరా, రణ తదితర భాషల పరిరక్షణకు సత్తుపాటి ప్రసన్న కృషి చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)