అమలులోకి వచ్చిన ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు!

Telugu Lo Computer
0

 

ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జంక్షన్  స్టేషన్ పేరును మార్చుతూ గతంలో ఆ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ రైల్వే స్టేషన్‌ను ఇక అధికారికంగా అయోధ్య కంటోన్మెంట్‌గా పరిగణిస్తున్నారు. ఆ మేరకు రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం మీదున్న పాత నేమ్ బోర్డులను అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు గతంలో అలహాబాద్ రైల్వే స్టేషన్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా.. ముఘల్‌సరయ్ రైల్వే జంక్షన్ పేరును పండిట్ దీల్ దయాల్ ఉపాధ్యాయ్ జంక్షన్‌గా మార్చడం తెలిసిందే. ఫైజాబాద్ రైల్వే స్టేషన్‌ పేరు మార్పుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ రైల్వే స్టేషన్‌కు పురాతనమైన చరిత్ర ఉంది.. దీన్ని అయోధ్య కంటోన్మెంట్‌గా పేరు మార్చడం సరికాదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. చారిత్రక ఫైజాబాద్ నగరం గుర్తింపును కోల్పోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ పేరు మార్పు గందరగోళానికి గురిచేసే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవర్గం మాత్రం బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయోధ్య పేరును సమీపంలోని అన్ని ప్రాంతాల్లోనూ వాడాలని చెబుతున్నారు. రాముడి జన్మస్థలమైన ఈ ప్రాంతాన్ని మరో పేరుతో పిలవడం సరికాదంటున్నారు. ఇప్పటికే అయోధ్య స్టేషన్ ఉందని.. ఇప్పుడు కొత్తగా అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్ పేరు ఏర్పాటు చేయడంతో ప్రజలు గందరగోళానికి గురైయ్యే అవకాశముందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. శతాబ్ధానికి పైగా చరిత్రకలిగిన ఫైజాబాద్ రైల్వేస్టేషన్ పేరును మార్చడం సరికాదని అక్కడ కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అభిప్రాయపడ్డాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)