బ్లడ్ క్లాట్ - లక్షణాలు - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


రక్తం గడ్డకట్టడం అంటే శరీరంలోని ఒక చోట రక్తం ఒక ముద్ద లాగా గట్టి పడుతుంది. బ్లడ్ క్లాట్ అయితే గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ రిపోర్ట్ ప్రకారం, శరీరంలో రక్తం గడ్డకట్టడం ఒక వైపు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది, మరోవైపు ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. గాయం లేదా కోత తర్వాత, రక్తం గడ్డకట్టి మరింత రక్తం బయటకు పోకుండా అడ్డుకుంటుంది. ఇలాంటి సందర్భాలలో రక్తం గడ్డకట్టడం మంచిదే. అయితే, శరీరంలో అనవసరంగా రక్తం గడ్డకట్టడం ప్రమాదకరం.

లక్షణాలు : అకారణంగా చెమటలు పట్టడం, ఒక నిర్దిష్ట భాగంలో లేదా శరీరం మొత్తంలో బలహీనతగా అనిపించడం, అకారణంగా ఆందోళన చెందడం లేదా భయంగా అనిపించడం వంటివన్నీ శరీరంలో ఏదో ఒక భాగంలో రక్తం గడ్డకట్టినప్పుడు కనిపిలే లక్షణాలు. తల తిరుగుతున్నట్లు అనిపించడం, చేతులు, కాళ్లు తరచుగా మొద్దుబారడం, ఛాతీలో నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన లక్షణాలు అయి ఉండొచ్చు. ఊబకాయం రక్తం గడ్డకట్టడానికి కారణం కావచ్చు, అలాగే ఇది బ్లడ్ క్లాట్‌ను తెలిపే లక్షణంగా కూడా ఉండవచ్చు. మహిళల్లో మెనోపాజ్ సమయంలో రక్తం గడ్డకట్టే రిస్క్ పెరుగుతుంది. ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. రక్తం గడ్డకట్టడం ప్రాణాంతకం కావచ్చు, కాబట్టి తొందరగా చికిత్స పొందడం మంచిది.

జాగ్రత్తలు : రక్తం గడ్డకట్టడం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీని బారిన పడకుండా ఉండాలంటే విటమిన్ K లభించే ఆహారాలు తినాలి. ఈ పోషకం శరీరంలోని రక్తాన్ని గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. మరోవైపు, ఇది శరీరం నుంచి రక్తం బయటకు రాకుండా ఆపుతుంది. ఆకుకూరలు (పాలకూర, కాలే), కాలేయం, గుడ్లు, డెయిరీ ప్రొడక్ట్స్‌, బీన్స్, బఠానీలలో విటమిన్ K సమృద్ధిగా లభిస్తుంది. వెల్లుల్లి రక్తం గడ్డకట్టకుండా ఆపగలదు. దీంట్లో అల్లిసిన్, అజోయిన్ అనే రెండు ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి, ఇవి బ్లడ్ క్లాట్స్‌కు చెక్ పెడతాయి. కొన్ని వెల్లుల్లి రెబ్బల పొట్టు ఒలిచి, దంచాలి. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మరిగించి, చల్లార్చాలి. రోజుకు ఒకసారి ఇది తాగితే, అకారణంగా రక్తం గడ్డకట్టే రిస్క్ తగ్గుతుంది. పసుపు కూడా రక్తం గడ్డ కట్టకుండా ఆపుతుంది. పసుపులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పసుపులో రక్తాన్ని పలుచగా చేసే కొన్ని పదార్థాలూ ఉన్నాయి. రోజుకు ఒకసారి ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూన్ పసుపు కలిపి తాగితే బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)