చెరుకు రసం - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


చెరుకు రసాన్ని తాగడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజన్‌లో వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. చెరుకు రసం మనకు సహజసిద్ధమైన ఫ్రక్టోజ్‌ను అందిస్తుంది. ఇది తక్షణమే శక్తిని అందిస్తుంది, దీంతో నీరసం, అలసట వెంటనే తగ్గుతాయి, మళ్లీ పని చేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది, ఉత్సాహంగా మారుతారు. చెరుకు రసంలో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి, ఇది యాంటీ ఆక్సిడెంట్లను, ప్రోటీన్లను, సాల్యుబుల్ ఫైబర్‌ను కూడా ఎక్కువ మొత్తంలోనే కలిగి ఉంటుంది. అందువల్ల మన శరీరానికి పోషణను అందిస్తుంది. అయితే చెరుకు రసాన్ని ఎట్టి పరిస్థితిలోనూ రోజూ తాగకూడదు. అది కూడా మోతాదుకు మించి అసలు తాగకూడదు. రోజూ పురుషులు అయితే ఒక కప్పు, స్త్రీలు అయితే ముప్పావు కప్పు మోతాదులోనే చెరుకు రసం తాగాల్సి ఉంటుంది. అంతకన్నా మించితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు చెరుకు రసాన్ని తాగకపోవడమే మంచిది. డైట్ పాటించే వారు చెరుకు రసంకు దూరంగా ఉండడమే బెటర్‌. రోజూ దీన్ని తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కనుక అధిక బరువు ఉన్నవారు చెరుకు రసాన్ని తాగకూడదు. ఇక డయాబెటిస్‌, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు, 4 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, విటమిన్ సప్లిమెంట్లను వాడుతున్నవారు, రక్తాన్ని పలుచగా చేసే ట్యాబ్లెట్లను వేసుకుంటున్నవారు చెరుకు రసంకు దూరంగా ఉండాలి. అలాగే జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, విరేచనాల బారిన పడిన వారు ఎట్టి పరిస్థితిలోనూ చెరుకు రసం తాగకూడదు.  కొన్ని చోట్ల చెరుకు రసం తీసే చోట్ల అపరిశుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈగలు వాలుతుంటాయి. కనుక అలాంటి చోట్ల చెరుకు రసం తాగకపోవడమే మంచిది. లేదంటే ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ బారిన కూడా పడవచ్చు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)