బీజేపీ తలుపులు తెరిస్తే శతాధిక వృద్ధ పార్టీ ఖాళీ అయిపోతుంది !

Telugu Lo Computer
0


త్తరాఖండ్‌ లోని పౌడీ గడ్వాల్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా ప్రసంగిస్తూ  వేణుగోపాల్‌కు వాస్తవ పరిస్థితులు తెలియవని అన్నారు. కాంగ్రెస్ నేతల కోసం బీజేపీ తలుపులు తెరిస్తే శతాధిక వృద్ధ పార్టీ ఖాళీ అయిపోతుందని, కేవలం పార్టీ కార్యాలయ భవంతులే మిగులుతాయని చమత్కరించారు. గత కొద్ది నెలల్లోనే 14,000 కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారని వెల్లడించారు. బీజేపీ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు కృషి చేయాలని కేసీ వేణుగోపాల్ ఇటీవల తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల్లో కశ్మీర్ అంశం ప్రస్తావించాల్సిన అవసరం ఏముందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించడంపై కూడా అమిత్‌షా కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్‌ కోసం గడ్వాల్ జవాన్లే ఎక్కువ మంది రక్తం చిందించారని గుర్తుచేశారు. ఉత్తరాఖండ్ తరహాలోనే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ప్రధాన మంత్రి గ్యారెంటీ ఇచ్చారని చెప్పారు. దేశంలో మతం ఆధారంగా ఏ చట్టం ఉండకూడదని భారతీయ జనసంఘ్ ఏర్పడినప్పటి నుంచి చెబుతోందన్నారు. అందుకు అనుగుణంగా దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని షా నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)