భారత్ వృద్ధి రేటు అంచనాలు పెంచిన ఐఎంఎఫ్‌ !

Telugu Lo Computer
0


2024లో భారత దేశం 6.8 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో వెలువరించిన అంచనాల్లో వృద్ధి 6.5 శాతంగా ఉండొచ్చని పేర్కొన్న ఆ సంస్థ.. తాజాగా 30 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దేశీయంగా డిమాండ్‌ పెరగడం, పనిచేసే వయసు కలిగిన జనాభా పెరగడం వంటివి వృద్ధికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. దీంతో ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలవనుంది. ఇదే కాలానికి పొరుగున ఉన్న చైనా 4.6 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐఎంఎఫ్‌ పేర్కొంది. 2024లో భారత్‌ 6.8 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొన్న ఐఎంఎఫ్‌.. 2025లో 6.5 శాతం వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ఈమేరకు తన ప్రపంచ ఎకనమిక్‌ ఔట్‌లుక్‌ను వెలువరించింది. పొరుగున ఉన్న చైనా వృద్ధి 2023లో 5.2 శాతం కాగా.. 2024లో 4.6 శాతం మాత్రమే వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది. 2025లో ఇది మరింత తగ్గి 4.1 శాతంగా నమోదు కావొచ్చని ఐఎంఎఫ్‌ పేర్కొంది. అక్కడి ప్రాపర్టీ సెక్టార్‌లో మందగమనం ఇందుకు కారణమని పేర్కొంది. ఇక ప్రపంచ ఆర్థికం 2023లో 3.2 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేయగా 2024, 2025 ఏడాదుల్లోనూ అదే స్థాయిలో వృద్ధిని నమోదు చేయొచ్చని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)