యూరిక్ యాసిడ్ - జాగ్రతలు

Telugu Lo Computer
0


రీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం అనేది చిన్న సమస్య అయినప్పటికీ భవిష్యత్తులో ఇది అనేక రకాలు దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు. ఈ సమస్య కారణంగా బోలు ఎముకల వ్యాధి కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే ఈ యూరిక్ యాసిడ్ సమస్య బారిన పడుతున్నారు. అంతేకాకుండా కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. చాలామందిలో ఈ సమస్య పెరగడానికి ప్రధాన కారణం ఊబకాయం, మూత్రపిండాల సమస్యలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.  జీర్ణ క్రియ లోపం, పొట్టలోని ప్రేగుల సమస్యలు, వ్యాయామాలు చేయకపోవడం, ఒకే చోట కూర్చుండడం, అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారాలు తినడం, కొవ్వు లేని ఆహారాలు తీసుకోవడం, రాత్రి పూట అతిగా తినడం, నిద్రలేమి సమస్యలు, మలబద్ధకం సమస్య, అతిగా నీటిని తాగకపోవడం, కిడ్నీలో లోపాలు,నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల యూరికి యాసిడ్ శరీరంలో పెరగడానికి ప్రధాన కారణమవుతాయి.   యూరిక్ యాసిడ్‌ కారణంగా తీవ్ర మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిది. యూరిక్ యాసిడ్‌ సమస్య కారణంగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రోజు తాగే నీటి కంటే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు తప్పులు బీన్స్ గోధుమ తో తయారు చేసిన ఆహారాలను తినకపోవడం చాలా మంచిది. రాత్రిపూట లైట్ ఫుడ్‌ని తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా రాత్రి 8 దాటిన తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోకపోవడం మంచిది. అలాగే ఈ యూరిక్ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారు ఒత్తిడికి దూరంగా ఉండాల్సి ఉంటుంది లేకపోతే జీర్ణ క్రియపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. రాత్రి పూట ఎక్కువసేపు నిద్రపోవడం చాలా మంచిది. దీని కారణంగా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. యూరికి యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ఆయుర్వేద నిపుణులు సూచించిన తిప్పతీగ వేర్లను దాని కాండాన్ని పొడిలా తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ పొడిని ఒక గ్లాసు నీటిలో వేసుకుని బాగా మిక్స్ చేసి మరిగించి తీసుకోవడం వల్ల సులభంగా ఉపగమనం పొందవచ్చు. ఇలా ప్రతిరోజు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)