భక్తురాలి ఇంట్లో దొంగతనం చేసిన పాస్టర్ !

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్  రావుపేట గ్రామంలో తిప్పని ప్రమీల, వీరభద్రయ్య దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా ఉన్న బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు చేసేందుకు వెళ్లేవారు. ఈ క్రమంలో చర్చిలో ఉన్న పాస్టర్ దంతాల రవిపాల్ బాధిత కుటుంబం ఇంటికి ప్రార్థన చేయడానికి తరుచూ వస్తూ ఉండేవాడు. పాస్టర్ ను వారు సొంత కొడుకులాగా భావించేవారు. తాము ఎంతో నమ్మిన పాస్టరే దొంగతనానికి పాల్పడడంతో బాధిత కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. అలంఖానిపేట గ్రామానికి చెందిన దంతాల రవిపాల్ గత పద్దెనిమిది సంవత్సరాలు గా అప్పల్రావుపేటలో పాస్టర్ గా పని చేస్తున్నాడు. తనకున్న పలుకుబడితో పేద ప్రజలకోసం కేటాయించిన బీసీ కాలనీలోని ప్రభుత్వ భూమిలో చర్చి నిర్మాణం చేసి భక్తుల విశ్వాసం చూరగొన్నారు. గ్రామంలో నిలువ నీడలేని నిరుపేదలకు గృహనిర్మాణం కోసం స్థలం ఇవ్వని నాయకులు పాస్టర్ కు ప్రభుత్వ భూమి ధారాదత్తం చేయడంతో గ్రామంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పాస్టర్ వ్యవహార శైలిపై కూడా పలురకాల ఆరోపణలు వచ్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చోరీ జరిగిన ఇంటికి వేసిన తాళాలు వేసినవి వేసినట్టుగానే ఉన్నాయి. దాంతో కేసును ఛాలెంజ్ గా తీసుకున్న స్థానిక ఎస్సై మహేందర్, సీఐ చంద్రమోహన్ ప్రాథమికంగా కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ టీమ్ ఘటన స్థలంలో ఫింగర్ ప్రింట్స్, ఇంటలిజెన్స్ సహకారంతో టవర్ డంప్ ఆధారాలతో దొంగతనం జరిగిన ప్రదేశంలో అక్కడికి వచ్చిన వారి ఆధారాలను ట్రేస్ చేసి 48 గంటల్లో కేసును ఛేదించారు. శుక్రవారం సాయంత్రం పలువురు అనుమానితులను సైతం విచారించారు. ఆ క్రమంలో పాస్టర్ రవి తాను చేసిన నేరాన్ని అంగీకరించారని సీఐ చంద్రమోహన్, ఎస్సై మహేందర్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. దొంగిలించిన బంగారాన్ని, నగదును సదరు వ్యక్తి నుండి రికవరీ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చాకచక్యంగా కేసును ఛేదించిన సీఐ, ఎస్సై, ఐడీ అసిస్టెంట్ సల్మాన్ పాషా, కానిస్టేబుల్స్ రమేష్, రాకేష్, శ్యామ్ సుందర్(హెచ్ సి), వెంకటేశ్వర్లును నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ అభినందించారు. 




Post a Comment

0Comments

Post a Comment (0)