జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుతీరుతుంది !

Telugu Lo Computer
0

ప్రజలు మార్పు కోరుతున్నారని జూన్ 4న కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఈరోజు ఉత్తరాఖండ్‌లో ప్రచారం చేశానని, ఉత్తరాఖండ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తమ పార్టీ అభ్యర్ధులు భారీ ఆధిక్యంతో విజయం సాధిస్తారని తాను నమ్ముతున్నానని అన్నారు. గత పదేండ్లుగా బీజేపీ ప్రభుత్వ పనితీరును ప్రజలు పరిశీలిస్తున్నారని, ఈసారి ప్రతిచోటా మార్పు చోటుచేసుకుంటుందని చెప్పారు. ఈసారి 400 స్ధానాలు సాధిస్తామన్న బీజేపీ నినాదాన్ని ప్రస్తావిస్తూ కాషాయ నేతలు చెప్పే మాటలకు క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్ధితికి తేడా ఉందని అన్నారు. బీజేపీ ఎక్కువగా ఊహించుకుంటోందని అన్నారు. ఇక ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ స్ధానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. హిల్ స్టేట్‌లో పోలింగ్ శాతంబ పెరిగేందుకు 11,000కుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ లేకుండా ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 180కి మించి సీట్లు దక్కవని అంతకుముందు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)