పామాయిల్ - ఆరోగ్య సమస్యలు ?

Telugu Lo Computer
0


దేశంలోకెల్లా ఆంధ్రప్రదేశ్ లోనే ఆయిల్‌పాం తోటల సాగు అత్యధికంగా ఉంది. దీన్ని వంటలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇతర వంట నూనెలతో పోల్చి చూసినట్లైతే పామాయిల్ ధర చాలా తక్కువ ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కువగా పామాయిల్‌నే ఉపయోగిస్తారు. కానీ పామాయిల్ అధికంగా యూజ్ చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని తాజాగా నిపుణులు వెల్లడించారు.  ప్రతి రోజూ పామాయిల్ వాడటం వల్ల ఫ్యాటీ లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయి. దీనిలో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో ఊబకాయం, కార్డియో వాస్క్యూలర్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పామాయిల్ 50 శాతం సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ను కంప్రెస్ చేస్తుంది. కాగా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలు, అథెరోస్కిరోసిస్ రిస్క్ ను పామాయిల్ పెంచుతుంది. మార్కెట్‌లో దొరికే చిప్స్ తయారీలో కూడా పామాయిల్ నే వాడతారు.  చాక్లెట్స్ తయారీలో కూడా పామాయిల్ ను అధికంగా ఉపయోగిస్తారు. కాగా పామాయిల్ తక్కువగా వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)