తమలపాకు జుట్టును కాలుష్యం నుంచి కాపాడుతుంది !

Telugu Lo Computer
0


భోజనం తిన్న తర్వాత తాంబూలం వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. శరీర ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు తమతపాకులో ఎన్నో ఉన్నాయి. తమలపాకులు శరీరానికే కాకుండా జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. తమలపాకు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే భోజనం తిన్న తర్వాత దీనిని తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తమలపాకు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. తమలపాకు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. విపరీతమైన కాలుష్యం వల్ల జుట్టు బలహీనపడి రాలిపోతుంది. తమలపాకు జుట్టును కాలుష్యం నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా, జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది. దీని కోసం తమలపాకులను చూర్ణం చేసి, ఆ రసాన్ని జుట్టుకు రాసుకుంటే చాలు. మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే తమలపాకు చుండ్రు సమస్యను నివారించడంలో కూడా సహాయపడుతుంది. తమలపాకులను జుట్టుకు పట్టిస్తే చుండ్రు సమస్య ఇట్టే తగ్గుతుంది. తమలపాకు స్కాల్ప్ ను ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. అంతే కాకుండా చాలా మందికి తలలో పేల సమస్య ఉంటుంది. ఈ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. తమలపాకు ఘాటైన వాసన వల్ల పేలు తొలగిపోతాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)