టాలీవుడ్ డైరెక్టర్ సూర్య కిరణ్ మృతి !

Telugu Lo Computer
0


టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సూర్యకిరణ్ మృతి చెందారు. సత్యం డైరెక్టర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న సూర్యకిరణ్ బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్లో వన్ ఆఫ్ ద కాన్టెస్టెంట్ గా పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు . గత కొంతకాలం నుంచి పచ్చకామర్లతో బాధపడుతున్న ఆయనకు సోమవారం గుండెపోటు వచ్చింది అంటూ కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తుంది . తెలుగులో సత్యం , ధన 51, రాజు భాయ్ వంటి సినిమాలకు డైరెక్టర్గా వర్క్ చేసి మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి చిత్రానికి దర్శకత్వం వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)