జామ ఆకులు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. దీనిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అలానే జామ ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయి. పొటాషియం, సల్ఫర్, సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి జామ ఆకుల్లో ఉంటాయి. జామ ఆకుల్లో క్యాన్సర్‌ వ్యతిరేక గుణాలు ఉంటాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్‌ గుణాలు మనకు వ్యాధులు రాకుండా రక్షణనిస్తాయి. కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారే ప్రక్రియని జామ ఆకులు అడ్డుకుంటాయి. దీంతో షుగర్‌కు చెక్ పెట్టవచ్చు. జామఆకులతో చేసిన టీని తాగడం వల్ల బరువు తగ్గుతారు. చిన్నపాటి గాయాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో జామఆకులని రుద్ది చూడండి. ఉపశమనం లభిస్తుంది. జామ ఆకుల వల్ల కొల్లాజెన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. జామ ఆకును జీర్ణ సంబంధ వ్యాధి చికిత్సకు వాడుతారు. గొంతు నొప్పి, చిగుళ్ల వ్యాధి , పంటి నొప్పి, నోటి పుండ్ల కోసం తాజా జామ ఆకులని వాడుతుంటారు. జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సహా విటమిన్ సి లక్షణాలు ఉంటాయి. జామ ఆకుల్లో రక్తాన్ని శుద్ధి చేసే చేసే గుణాలు ఉన్నాయి. అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. ప్లేట్‌లెట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)