జాకీర్ హుస్సేన్, శంకర్‌ మహదేవన్‌ కు గ్రామీ అవార్డులు

Telugu Lo Computer
0


మెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా అందించే 66వ 'గ్రామీ అవార్డుల' ప్రదానోత్సవం ఈరోజు అట్టహాసంగా జరిగాయి. ఈ ప్రతిష్టాత్మక మ్యూజిక్ అవార్డ్ షోకు స్టార్ సింగర్ ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా వ్యవహరించగా, పలువురు టాప్ ఆర్టిస్టులు వేదికపై లైవ్ ఫర్ఫార్మెన్స్‌ చేసి అదరగొట్టారు. ఈ అవార్డు వేడుకలలో ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్టులు శంకర్ మహదేవన్​, జాకీర్ హుస్సేన్ సత్తా చాటారు. వీరు కంపోజ్​ చేసిన 'దిస్ మూమెంట్​' అనే ఆల్బమ్ కు గ్రామీలో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు అందుకోగా.. ఈ పాటను 8 మంది శక్తి అనే బ్యాండ్ పేరుతో కలిసి కంపోజ్ చేశారు. ఇందులో జాకీర్ హుస్సేన్ ​(తబ్లా), శంకర్​ మహదేవన్​(సింగర్​), వి సెల్వగనేశ్​ (పెర్కషనిస్ట్​), జాన్ మెక్​ లాగ్లిన్ (గిటార్​) గనేశ్​ రాజాగోపాలన్​ (వయోలిన్​) కంపోజ్ చేశారు. దీంతో పాటు జాకిర్ హుస్సేన్ మరో గ్రామీ అవార్డుని కూడా అందుకున్నారు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరిలో 'పాస్తో' ఆల్బమ్ కి బెలా ఫ్లెక్, ఎడ్గర్ మేయర్, రాకేష్ చౌరాసియా, జాకిర్ హుస్సేన్‌లు కలిసి ఈ అవార్డు అందుకున్నారు. మొత్తంగా ఈ ఈవెంట్‌లో ఆరుగురు భారతీయులు గ్రామీ అవార్డులు అందుకోవడం విశేషం. జాకీర్ హుస్సేన్‌కు మూడు అవార్డులు, రాకేష్ చౌరాసియాకు రెండు అవార్డులు రాగా.. శంకర్​ మహదేవన్ ఒకటి అందుకున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)