ఇప్పుడున్న మౌలిక సదుపాయాలతో ట్రేడింగ్‌ సమయాన్ని పెంచడం సాధ్యం కాదు !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌మార్కెట్లో ట్రేడింగ్‌ సమయాన్ని పెంచాలనే సూచనపై మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ కీలక వ్యాఖ్యలు చేసింది. సెబీ ఇప్పటి వరకు దీనిపై ఒక అభిప్రాయానికి రాలేదని సెబీ ఛైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌ అన్నారు. స్టాక్‌ బ్రోకర్లు నిర్వహించిన ఒక సదస్సులో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే బ్రోకింగ్‌ కంపెనీ యజమాన్యం మాత్రం వారి వారి మదుపర్ల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలను సేకరించి ఫిబ్రవరి నెలాఖరులోపు తమ అభిప్రాయం చెబుతామన్నట్లు తెలిసింది. ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించడం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయని సెబీ చీఫ్‌ హెచ్చరించారు. ప్రస్తుతం సెబీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలతో ట్రేడింగ్‌ సమయాన్ని పెంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఒకవేళ ట్రేడింగ్‌ సమయం పెంచితే ఈక్విటీ మార్కెట్లకు, కమోడిటీస్‌ మార్కెట్‌కు తేడా లేకుండా పోతుందన్నారు. ప్రస్తుతం ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈక్విటీ మార్కెట్‌ ట్రేడింగ్‌ జరుగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)