ఇమ్రాన్ ఖాన్‌, బుస్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష !

Telugu Lo Computer
0


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, ఆయన భార్య బుస్రా బీబీకి తోషాకానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు 14 ఏళ్ల శిక్షను విధించారు. పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదని కోర్టు ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు కూడా విధించింది. ఆ జంట సుమారు రూ.1.5 బిలియన్లు జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది. ఇవాళ కోర్టు విచారణకు బుస్రా బీబీ హాజరుకాలేదు. ఫిబ్రవరి 8వ తేదీన పాక్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికలకు 8 రోజుల ముందే ఈ తీర్పు రావడం విశేషం. రెండు రోజుల క్రితం అఫిషియల్ సీక్రెట్స్ చట్టం కింద ఇమ్రాన్‌తో పాటు విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖరేషికి మరో కేసులో పదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)