ఒకవేళ రాము మాట్లాడగలిగితే ?

Telugu Lo Computer
0

ఎద్దు కాడిని ఎత్తుకోవడం మొదల అప్పగించిన పనులను తనంతట తానుగా నిర్వహిస్తోన్న వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. దీన్ని 'ఎక్స్‌' వేదికగా పోస్ట్‌ చేశారు. ''ఒకవేళ రాము (ఎద్దు) మాట్లాడగలిగితే, జీవితంలో సానుకూలంగా ఎలా ఉండాలనే దానిపై ప్రపంచంలోని వక్తలందరూ ఇచ్చే దానికంటే మంచి సలహా ఇస్తుందని పందెం కాస్తున్నా'' అని రాసుకొచ్చారు. పంజాబ్‌లోని ఓ ఆశ్రమానికి చెందిన 'రాము' ఎవరి నియంత్రణ లేకుండానే బండిని లాగుతూ అవసరమైతే రివర్స్‌ తీసుకుంటూ పశువుల దాణా, ఇతరత్రా సామగ్రిని సరైన చోటుకే చేర్చుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. కృత్రిమ మేధ సాంకేతికత కంటే 'రాము' మెరుగ్గా పనిచేస్తుందని ఓ నెటిజన్‌ స్పందించారు. దీన్ని సంస్థలో నియమించుకోవాలని లేకపోతే మహీంద్రా ఆటో, టెంపో స్థానంలో వచ్చేస్తుందని సరదాగా సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)