పూరీ క్షేత్రంలో జగన్నాథ్‌ కారిడార్‌ !

Telugu Lo Computer
0


డిశాలోని పూరీ శ్రీక్షేత్రంలో కొత్తగా నిర్మించిన పరిక్రమణ మార్గం శ్రీజగన్నాథ్‌ కారిడార్‌ భక్తులకు అందుబాటులోకి రానుంది. భక్తుల సౌకర్యాలే ధ్యేయంగా నూతన నిర్మాణాలు, మఠాలు, ఇతర ఆలయాల ఆధునికీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. కారిడార్‌ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెల 12 నుంచి 17 వరకు ప్రారంభ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీమన్నారాయణ మహా యజ్ఞం, శ్రీక్షేత్రం నాలుగు ద్వారాల వద్ద వేద పారాయణం, ఉపనిషత్తుల ప్రవచనాలు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసేందుకు శ్రీక్షేత్ర యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో పాల్గొనాలని తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ పుణ్యధామాల శంకరాచార్యులను, నేపాల్‌ రాజ కుటుంబికులను, ఇతర పుణ్యక్షేత్రాల యాజమాన్యాలు, సిద్ధ యోగులు, పండితులను ఆహ్వానించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)