తొమ్మిదోసారి డేరా బాబాకు పేరోల్ !

Telugu Lo Computer
0


డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ (డేరాబాబా)కు మరోసారి పెరోల్ లభించింది. ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి కేసులో దోషి అయిన గుర్మిత్ కు శుక్రవారం (జనవరి19) 50 రోజులపాటు జైలు విడుదల అయ్యేందుకు పెరోల్ ఇచ్చారు. డేరాబాబా ఇప్పటికే చాలాసార్లు పెరోల్ పై విడుదలయ్యారు. అయితే తాజాగా మంజూరైన పెరోల్ తో ఇప్పటివరకు రెండేళ్లలో ఏడోసారి కాగా.. గడిచిన నాలుగేళ్లలో తొమ్మిదో సారి జైలు నుంచి విడుదలయ్యారు. డేరా స్వచ్ఛ సౌదా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం, ఓ జర్నలిస్టు్ హత్య కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. 2017 లో ఇద్దరు మహిళలపై అత్యాచారం, జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాను దోషిగా కోర్టు తేల్చారు అప్పటినుంచి హర్యానాలోని రోహ్ తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శిక్ష కాలంలో పెరోల్స్ పై రావడం , పోవడం చర్చనీయంశమైంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)