హైదరాబాద్‌లో జాతీయ ఇన్నోవేషన్ ఫెయిర్ ప్రారంభం !

Telugu Lo Computer
0


టీటీ-హైదరాబాద్‌లో కేంద్ర విద్యా శాఖ ప్రతిష్టాత్మక ఆర్‌&డీ ఇన్నోవేషన్‌ ఫెయిర్‌ 'ఇన్వెంటివ్‌-2024' రెండో ఎడిషన్‌ ను  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే 'ఇన్వెంటివ్‌-2024' ఇన్నోవేషన్‌ ఫెయిర్‌లో దేశంలోని 53 ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు రూపొందించిన 120 సంచలనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. ఈ ఆవిష్కరణలు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌లు, ట్రిపుల్‌ఐటీలు, ఐఐఎస్‌ఈ బెంగుళూరు వంటి దేశంలోని టాప్ 50 ఎన్‌ఐఆర్‌ ర్యాంక్ ఇంజనీరింగ్ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. సైన్స్, టెక్నాలజీ, పారిశ్రామిక రంగాల్లో ఔత్సాహికులు, అద్భుతమైన ప్రతిభావంతుల సమ్మేళనానికి ఐఐటీ హైదరాబాద్‌లో జరుగుతున్న 'ఇన్వెంటివ్‌-2024' అత్యంత ప్రాధాన్యతను తీసుకొచ్చిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలో విద్య పాత్ర కీలకమైనదిగా తాను గుర్తించినట్లు ఆయన చెప్పారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి, పలువురు ప్రముఖ విద్యాసంస్థల అధిపతులు, పరిశ్రమల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)