హాఫ్ హాలిడే ప్రకటించిన త్రిపుర !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులు మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆరంభమౌతుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో అద్వితీయ ఆలయం అందుబాటులో రానుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వేలాదిమంది ప్రముఖులు హాజరు కానున్నారు. వివిధ దేశాల నుంచి వందమంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. ఈ నెల 15వ తేదీ నాడే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ఆచారాల మొదలయ్యాయి. ఆగమోక్తంగా పూజాదికాలను నిర్వహిస్తోన్నారు అర్చకులు. వేదమంత్రోచ్ఛారణలతో అయోధ్యా నగరం మారుమోగిపోతోంది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇప్పటికే రాములోరు.. ఆలయ ప్రవేశం చేశారు. గర్భగుడిలో లక్ష్మణ సమేత శ్రీసీతారామాంజనేయుల వారు ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఇప్పటికే పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఆలయాలను సందర్శిస్తోన్నారు. ఏపీలోని శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో గల లేపాక్షి ఆలయంతో ఈ పర్యటన మొదలైంది. ఆలయ ప్రారంభోత్సవం రోజైన జనవరి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలు కూడా సగం రోజు సెలవును ప్రకటిస్తూ వస్తోన్నాయి. తాజాగా త్రిపుర ఈ జాబితాలో చేరింది. జనవరి 22వ తేదీన హాఫ్ డే సెలవును ప్రకటించింది. ఈ మేరకు జీవోను జారీ చేసింది. త్రిపురలోని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పాఠశాలలు, కళాశాలలకు మధ్యాహ్నం 2:30 గంటల వరకు సెలవు లభించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)