కరోనా కొత్త వేరియంట్‌పై ఆందోళన చెందవద్దు !

Telugu Lo Computer
0


ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న జేఎన్‌.1 వేరియంట్ ప్రమాదకరం కాదని చెబుతున్నారు. ఈ వేరియంట్ గురించి వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జేఎన్‌.1 గురించి నవంబర్ 21వ తేదీన డబ్ల్యూహెచ్‌వో ఓ ప్రకటన విడుదల చేసింది. ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్‌గా ఉన్న బీఏ.2.86 వేరియంట్‌లో జరిగిన మ్యుటేషన్‌ వల్ల జేఎన్‌.1 వేరియంట్ ఏర్పడిందని అందులో పేర్కొంది. ''ఈ వేరియంట్‌కు వ్యాపించే గుణం మోడరేట్‌గా(మధ్యస్థం) ఉంది. మన ఒంట్లో ఉన్న యాంటీబాడీస్‌ను ఛేదించే గుణం కూడా మధ్యస్థమే. సివియర్ జబ్బు కలిగించేంత శక్తి దీనికి లేదు'' అని తెలిపింది. 65 ఏండ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేషెంట్లను కరోనా హైరిస్క్ గ్రూపు నుంచి మోడరేట్ రిస్క్‌లోకి మారుస్తూ డబ్ల్యూహెచ్‌వో ప్రకటన విడుదల చేసింది. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న పేషెంట్లు, సివియర్ ఆటోఇమ్యూన్ డిసీజ్‌ ఉన్న వారిని మాత్రమే హైరిస్క్‌ గ్రూపుగా పేర్కొంది. వీరిలోనూ 6 శాతం మందికి మాత్రమే కరోనా సివియర్ జబ్బు కలిగించే అవకాశం ఉందని పేర్కొంది. తక్కువ రిస్క్ గ్రూపు, మోడరేట్ రిస్క్ గ్రూపులో ఉన్న వారిలో 0.5 శాతం నుంచి 3 శాతం మందికే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యేంత స్థాయిలో వ్యాధి సోకే చాన్స్ ఉంటుందని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)