వాము ఆకు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


వాము ఆకులను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ వాము ఆకులు కడుపునొప్పిని తగ్గించడానికి అలాగే దగ్గు జలుబు చేసినప్పుడు ఎంతో బాగా ఉపయోగపడతాయి. కరివేపాకు, కొత్తిమీరను ఉపయోగించినట్లు వాము ఆకులను కూడా కూరల్లో వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అజీర్తి, ఉబ్బరం, పొట్ట గ్యాస్ లాంటి సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం కూడా తగ్గుతుంది. అలాగే ప్రేగుల్లో నొప్పి అల్సర్లు లాంటివి తగ్గుతాయి. వామాకులలో క్యాలరీలు తక్కువ ప్రోటీన్ ఫ్యాట్ కార్బోహైడ్రేటు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది.. బరువును కూడా తగ్గిస్తాయి..వామాకులో ఎ, బి, సి విటమిన్లు, అమినో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం. తలనొప్పి నివారణకు కూడా వాము ఆకు ఔషధంలా పనిచేస్తుంది. వాము ఆకుల్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది. ఈ ఆకులు సువాసనలను వెదజల్లుతాయి.. వీటిని ఎక్కువగా చట్నీలు, జ్యూస్, బజ్జీలు, పకోడీలు కూరలులో కూడా వాడుకోవచ్చు. ఈ ఆకుల వల్ల ఆయుష్ పెరుగుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వాము ఆకుల్ని నిత్యం వాడే వారికి దగ్గు, జలుబులు అస్సలు రావు. ఒకవేళ వస్తే పది వాము ఆకుల్ని కడిగి వేడి నీటిలో వేసి మరిగించుకోవాలి. ఈ నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి తీసుకోవాలి.. మీకు కావాలి అనుకుంటే తేనెను కూడా వేసుకోవచ్చు.. ఇలా ప్రతి రోజూ తీసుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందుతారు..


Post a Comment

0Comments

Post a Comment (0)