ఉల్లి ఎగుమతులపై నిషేధం వెనక్కి తీసుకోవాలి !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని నాసిక్‌లో జిల్లాలోని చంద్వాడ్‌ గ్రామానికి చెందిన ఉల్లి రైతులు చేపట్టిన నిరసనలో శరద్‌ పవార్‌ పాల్గొని  మాట్లాడుతూ రైతులంతా ఏకమై తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు. ఉల్లి రైతులు మంచి పంట కోసం శ్రమించే చిన్న రైతులని, తాను కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో ఉల్లి ధరల్ని ఎప్పుడూ తగ్గించలేదని చెప్పారు. అలాగే, ఎగుమతులనూ నిషేధించలేదన్నారు. ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని పవార్‌ కోరారు. ద్రాక్షపై రూ.160 మేర బంగ్లాదేశ్ దిగుమతి సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయంతో ద్రాక్ష ఉత్పత్తిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. దేశీయంగా లభ్యతను పెంచడంతో పాటు ధరల్ని అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలోని పలు చోట్ల ఉల్లి రైతులు నిరసనలకు దిగారు.

Post a Comment

0Comments

Post a Comment (0)