హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై పోలీస్ ఆఫీసర్ ఫిర్యాదు !

Telugu Lo Computer
0


జమ్మూ కాశ్మీర్‌కి చెందిన ఓ పోలీసు చేసిన ట్వీట్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పాలసీలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ బ్యాంకు పోలీసులకు లోన్ మంజూరు చేయట్లేదని ఇంతియాజ్ హుస్సేన్ అనే పోలీసు ఆరోపణలు చేశారు. పర్సనల్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత తనకు ఆ విషయం తెలిసిందని చెప్పారు. దీనికి సంబంధించి ఎక్స్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఓ ట్వీట్‌ చేశారు. ఖాకీ దుస్తులు ధరించిన పోలీసులకు వ్యతిరేకంగా బ్యాంక్ పాలసీలు ఉన్నాయని చెప్పారు. ఇంతియాజ్‌ హుస్సేన్‌(@hussain_imtiyaz) 2023 డిసెంబర్ 19న చేసిన ట్వీట్‌లో 'హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. పాలసీలు పరంగా బ్యాంకు పోలీసులకు లోన్ అందించట్లేదని తెలిసి షాక్ అయ్యాను. ఇది చాలా బాధాకరం, అవమానకరంగా ఉంది. ఖాకీ దుస్తులు ధరించి, గొప్ప దేశానికి సేవ చేయడానికి పగలు, రాత్రి శ్రమించే వ్యక్తులతో ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు.' అని పేర్కొన్నారు. ఇంతియాజ్ చేసిన ట్వీట్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (@HDFCBank_Cares) స్పందించింది. 'హాయ్ ఇంతియాజ్, అలాంటి పాలసీ ఏదీ లేదు. దేశవ్యాప్తంగా చాలా మంది పోలీసులు మా కస్టమర్లుగా ఉన్నారు, మా నుంచి లోన్లు తీసుకున్నారు. మీకు ఎదురైన అనుభవానికి మమ్మల్ని క్షమించండి. దీని గురించి చింతిస్తున్నాం. మీరు ఎదుర్కొన్న సమస్యను పరిష్కరించేందుకు మిమ్మల్ని సంప్రదిస్తాం.' అని తెలిపింది. అయితే హుస్సేన్ పోస్టుపై నెటిజన్లు వివిధ కామెంట్లు చేస్తున్నారు. తమ వృత్తుల కారణంగా బ్యాంక్‌లు లోన్లు తిరస్కరించిన అనుభవాలను పేర్కొంటూ కామెంట్లు చేశారు. సంబంధిత బ్యాంకుల్లో స్థిరమైన ఆదాయాలు, శాలరీ అకౌంట్‌ ఉన్నప్పటికీ జర్నలిస్టులు, న్యాయవాదులు లోన్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను కొందరు ప్రస్తావించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)