పెరిగిన బంగారం, వెండి ధరలు !

Telugu Lo Computer
0


దేశంలో  పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, గోల్డ్‌ రేట్స్‌ భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ఏకంగా రూ. 63 వేలకు చేరుకుంది. ఇక గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలో హెచ్చు, తగ్గులు కనిపించాయి. అయితే, తాజాగా గురువారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 63,000 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 58,350కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర అత్యధికంగా రూ. 63,650గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 57,750కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000 వద్ద కొనసాగుతోంది.  హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,750గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 63,000 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు సాగర నగరం విశాఖపట్నంలోనూ ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,750కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర పెరగడంతో.. అదే బాటలో వెండి ధరలు కూడా పయణించాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై గురువారం రూ. 1000 వరకు పెరిగింది. దీంతో ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, బెంగళూరు పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 78,500కి చేరుకుంది. ఇక చెన్నై, కేరళతో పాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,200 వద్ద కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)