కాంగ్రెస్‌ క్రౌడ్‌ ఫండింగ్‌కు 48 గంటల్లో రూ.2.81 కోట్లు సేకరణ !

Telugu Lo Computer
0


'దేశం కోసం విరాళం' పేరిట కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించిన క్రౌడ్‌ ఫండింగ్‌ కార్యక్రమానికి 48 గంటల్లో రూ.2.81 కోట్లు సమకూరాయి. ఇప్పటి వరకూ మొత్తం లక్షా 13 వేల మంది తమవంతుగా విరాళాలందించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రూ.1.38 లక్షలను విరాళంగా అందించి సోమవారం ఈ నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విరాళాలకు సంబంధించిన 80 శాతం లావాదేవీలన్నీ యూపీఐ ద్వారా సాగాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం కోసం పార్టీ రూపొందించిన యాప్‌పై 20 వేల సైబర్‌ దాడులు జరిగాయని వివరించాయి. వీటిలో అత్యధికం విదేశాల నుంచి జరిగాయని, 1340 దాడులు సమాచార దోపిడీ కోసం ఉద్దేశించినవని తెలిపాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, కొందరు సీనియర్‌ పార్టీ నేతలు సహా మొత్తం 32 మంది రూ.లక్ష మించి విరాళాలందించారని పార్టీ వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు నిధుల కోసం గాంధీ సంతకాలతో కూడిన టోపీలు, మగ్గులు, టీ-షర్టులను విక్రయించనున్నామని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)