లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు - బహిరంగ మాంసం, గుడ్ల విక్రయంపై నిషేధం !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోహన్‌ యాదవ్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనుమతించదగిన డెసిబెల్‌ స్థాయికి మించి మతపరమైన ప్రదేశాలలో లౌడ్‌ స్పీకర్లను ఉపయోగించడాన్ని నిషేధించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం నుండి వచ్చిన యాదవ్‌ బహిరంగంగా మాంసం, గుడ్లు విక్రయించడాన్ని కూడా నిషేధించారు. శబ్ద కాలుష్యం, లౌడ్‌ స్పీకర్ల అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్క్వాడ్‌లు లౌడ్‌ స్పీకర్లను ఉపయోగించే మతపరమైన, బహిరంగ ప్రదేశాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తాయి. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎంగా మోహన్‌ యాదవ్‌ జారీ చేసిన మొదటి ఉత్తర్వు ఇది అని అదనపు ప్రధాన కార్యదర్శి (హోమ్‌) డాక్టర్‌ రాజేష్‌ రాజోరా తెలిపారు. సుప్రీంకోర్టు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) ఆదేశాల మేరకు లౌడ్‌ స్పీకర్ల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా తక్షణమే అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.బిజెపి కార్యకర్తపై దాడి కేసులో నిందితుడి ఇంటి కూల్చివేతబిజెపి కార్యకర్తపై దాడి చేసిన నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేయాలని అధికారులను కొత్త సిఎం మోహన్‌ యాదవ్‌ తొలి ఆదేశాలిచ్చారు. ఈ నెల 3న ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో జరిగిన ఘర్షణలో బిజెపి కార్యకర్త దేవేంద్ర ఠాకూర్‌ చెయ్యి తెగింది. ఈ కేసులో ఫరూఖ్‌ రెయిన్‌తోపాటు అస్లాం, షారుక్‌, బిలాల్‌, సమీర్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిఎం ఆదేశాలతో ఫరూఖ్‌ రెయిన్‌ ఇంటిని బుల్డోజర్‌తో అధికారులు గురువారం కూల్చివేశారు. కొత్త సిఎం మోహన్‌ యాదవ్‌ ఈ మేరకు తొలి ఆదేశం ఇవ్వడం చర్చకు దారి తీసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)