ఉత్తరాఖండ్‌లో కనిపించిన మంచు చిరుత

Telugu Lo Computer
0


త్తరాఖండ్ లోని దర్మా లోయ, బంగ్లింగ్ గ్రామంలో ఇటీవల ఒక మంచు చిరుత కనిపించింది. ఈ లోయలో మంచు చిరుత కనిపించడం ఇది వరుసగా రెండవ సంవత్సరమని ధర్చులా రేంజ్ అధికారి దినేష్ జోషి తెలిపారు. సముద్ర మట్టానికి 200 మీటర్ల ఎత్తున ఉన్న బెంగ్లింగ్ గ్రామంలో రెండు రోజుల క్రితం మంచు చిరుతను ఐటిబిపి గస్తీ సిబ్బంది రెండు రోజుల క్రితం చూసినట్లు గురువారం ఆయన తెలిపారు. అదే ప్రాంతంలో గత ఏడాది కూడా మంచు చిరుత కనిపించిందని ఆయన తెలిపారు. జీవ వైవిధ్యంలో సంపన్నమైన దర్మా లోయలో మంచు చిరుత సంచరిస్తున్నదనడానికి ఇదే నిదర్శనమని ఆయన తెలిపారు. శీతాకాలంలో గ్రామస్తులు తమ గ్రామాలను వదిలి తక్కువ చరి ఉండే ప్రదేశాలకు తరలిపోతారని, అదే సమయంలో మంచు చిరుత కనిపించడం యాదృచ్ఛికమని ఆయన తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)