బీహార్‌లో పూజారి దారుణ హత్య !

Telugu Lo Computer
0


బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో దనపుర్ గ్రామంలోని శివాలయంలో మనోజ్‌కుమార్‌ పూజారిగా పనిచేస్తున్నాడు. అతను గత ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. దీంతో పూజారి కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓవైపు పూజారి కుటుంబ సభ్యులు, మరోవైపు పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ అతని ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో స్థానిక పొదల్లో మనోజ్‌ కుమార్ శవమైన కనిపించాడు. హత్యకు పాల్పడిన దుండగులు ఆయన శరీరం నుంచి కళ్లను పెరికివేసి, జననాంగాలను కోసేశారు. పూజారి మరణ వార్త వ్యాప్తి చెందడంతో గ్రామస్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దర్యాప్తు చేపట్టిన పోలీసుల నిర్లక్ష్యానికి గ్రామస్తులు ఆగ్రహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బందిపై స్థానికులు రాళ్లు రువ్వారు. అంతేకాకుండా పోలీస్‌ వాహనానికి నిప్పంటించారు. పోలీసుల విధి నిర్వహణలో లోపం కారణంగా పూజారీ మరణించినట్లు పోలీసులను నిందించారు. ఆందోళనను అదుపు చేసేందుకు పోలీసులు ఏరియల్‌ ఫైరింగ్‌ చేయాల్సి వచ్చింది. మరణించిన పూజారి సోదరుడు అశోక్ కుమార్ సాహ్ బీజేపీ మాజీ డివిజనల్ అధ్యక్షుడు. అతను పోలీసుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మనోజ్ చివరిసారిగా ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లడం సీసీటీవీ కెమెరాలో కనిపించిందని మృతుడి సోదరుడు సురేష్ సాహ్ తెలిపాడు. మనోజ్ గుడి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మూడు గంటల్లోగా దర్యాప్తు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ, మనోజ్ మృతదేహం లభ్యమైన ఆరు రోజుల వరకు ఎలాంటి పురోగతి లేదని అన్నాడు. గోపాల్‌గంజ్ ఎస్‌డీపీఓ ప్రాంజల్ మాట్లాడుతూ హత్య వెనుక ఉద్దేశ్యం, నేరస్థులు ఎవరనేది ఇంకా తెలియలేదు. మృతుడు కనిపించకుండా పోయిన ఆరు రోజుల తర్వాత మృతుడి ఇంటి ముందు పొదల్లో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దానిని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపాం. పోలీసులు గాల్లో కాల్పులు జరిపి గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు మీడియాకు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)