చికెన్ ధరలకు రెక్కలొచ్చాయ్ !

Telugu Lo Computer
0


కార్తీక మాసం అయ్యిపోయింది. ఇక చికెన్ ధరలు పెరగుతున్నాయి. ఈరోజు  కిలో చికెన్ స్కిన్ లెస్ 260 రూపాయలకు అమ్మారు. అదే విధంగా స్కిన్ తో 220 రూపాయల వరకు అమ్ముతున్నారు. కార్తీక మాసంలో కిలో 130 నుంచి 180 రూపాయల వరకు ఉండేది. ప్రస్తుతం కార్తీక మాసం అయిపోవడంతో మాంస ప్రియలు చికెన్ కొనుగోలుకు ఎగబడ్డారు. నాన్ వెజ్ ప్రియుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో మాంసప్రియులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలం వినియోగం ఎక్కువగా ఉండటం వలన చికెన్ ధరలు మరింత పెరబోతున్నాయని అంటున్నారు. అయితే, ఉదయం నుంచే చికెన్ కొనుగోలు కోసం మాంసాహార ప్రియులతో మార్కెట్ కిటకిటలాడుతోంది.. మరోవైపు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటడంతో సామాన్య ప్రజలు చికెన్ వైపే మొగ్గు చూపుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)