ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి చిగురవాడలో ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపేసింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని కట్టు కథ కూడా అల్లింది. గొంతు నులిమి చంపి అప్పుల బాధతో భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ అసలు విషయాన్ని బయటపెట్టాయి. భర్త గోవింద్‌కు భార్య మానసతో ఇటీవల పెళ్లి అయింది. అయితే మానసకు పెళ్లిముందే మరో వ్యక్తితో పరిచయం ఉంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ గోవింద్‌తో మాసనకు పెళ్లి అయింది. దీంతో భర్తను చంపాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఇంట్లో నిద్రపోతున్న గోవింద్‌ను గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు భర్త బంధువులకు ఫోసి చేసింది. గోవింద్‌కు అప్పులు ఉండటంతోనే ఆత్మహత్య చేసుకున్నారని బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే భర్తను చంపకముందు ఓ వ్యక్తి ఇంటికి వచ్చినట్లు సీసీ పుటేజ్‌లో క్లియర్‌గా పోలీసులకు కనిపించింది. ఈ మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులకు భార్య మానస అసలు విషయం చెప్పింది. భర్త గోవింద్‌ను చంపినట్లు స్పష్టం చేసింది. దీంతో భార్య మానసను పోలీసులు అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)