దేశవ్యాప్తంగా వంద దాటిన జేఎన్‌.1 సబ్‌ వేరియంట్‌ కేసులు !

Telugu Lo Computer
0


దేశంలో ఇటీవల వెలుగు చూసిన కొవిడ్‌-19 ఉపరకం జేఎన్‌.1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 40పైగా కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా జేఎన్‌.1 పాజిటివ్‌ కేసుల సంఖ్య 109కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గుజరాత్‌లో అత్యధికంగా 36 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో తొమ్మిది, కేరళలో ఆరు, రాజస్థాన్‌, తమిళనాడులలో నాలుగు చొప్పున, తెలంగాణలో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు సమాచారం. కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. బాధితుల్లో 92శాతం మంది ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. ఆసుపత్రిలో చేరే పరిస్థితి కూడా తక్కువేనని, కేవలం ఇతర ఆరోగ్య సమస్యలతో చేరుతున్న వారిలోనే యాదృచ్ఛికంగా కొవిడ్‌ బయటపడుతోందని వెల్లడించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)