కలబంద మొక్క - వాస్తు శాస్త్రం !

Telugu Lo Computer
0


ఇంట్లో కలబంద మొక్కను పెంచితే వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఎంతో మేలు జరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరగడంలో కలబంద మొక్క ఉపయోగపడుతుంది. కలబంద మొక్కను సరైన దిశలో ఏర్పాటు చేసుకుంటేనే ప్రయోజనం లభిస్తుంది. కలబంద మొక్కను ఇంట్లో ఎప్పుడూ తూర్పు దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకున్నా మంచి లాభం కలుగుతుంది. ఇక ఉద్యోగంలో పురోగతి కావాలంటే కలబంద మొక్కను ఇంటికి పడమర దిశలో పెట్టుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కలబంద మొక్కను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వాయువ్య దిశలో ఏర్పాటు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. వాయువ్య దిశలో కలబంద మొక్కను నాటడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరం కావాలంటే కలబంద మొక్కను సరైన దిశలోనే ఉంచుకోవాలి. నెగిటివ్‌ ఎనర్జీ తొలగిపోవడమే కాకుండా.. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇక ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను ఏర్పాటు చేసుకోవడం వల్ల డబ్బు, ప్రమోషన్ లభిస్తాయి. ఇంటి బాల్కనీలో, గార్డెన్ లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)