రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 10 November 2023

రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు !


హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఏరియాలోని షేక్‌పేట్‌లో 2 ఎకరాల భూమిని ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయిస్తే దానిని సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో సహా ఇతరులు సొంత అవసరాలకు వాడుకుంటున్నారనే పిల్‌పై హైకోర్టు స్పందించింది. రాఘవేంద్రరావు, ఆయన బంధువులకు మరోసారి నోటీసులు ఇచ్చింది. గత ఏడాది మార్చిలోనే నోటీసులు ఇచ్చినా అంది నట్లుగా రికార్డుల్లో లేకపోవడంతో గురువారం మళ్లీ నోటీసుల్ని జారీ చేసింది. విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. బంజారాహిల్స్‌ సర్వే నెం. 403/1లో రెండు ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంటూ మెదక్‌కు చెందిన బాలకిషన్‌ 2012లో పిల్‌ దాఖలు చేశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరథే, జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. ప్రతివాదులైన రాఘ వేంద్రరావు, ఆయన బంధువులు కృష్ణమోహన్​ రావు, చక్రవర్తి, విజయ లక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి నోటీసులిచ్చింది. 

No comments:

Post a Comment