వంద రూపాయలు లంచం అన్నది చాలా చిన్న విషయం !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని పూణె జిల్లాకు చెందిన పింగళే అనే వ్యక్తి 2007లో పౌడ్‌లోని గ్రామీణ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అనిల్ షిండే వద్దకు వెళ్లాడు. మేనల్లుడు దాడి చేయడంతో గాయపడిన తనకు ఆ మేరకు ధృవీకరణ పత్రం ఇవ్వాలని కోరాడు. డాక్టర్‌ షిండే లంచంగా రూ.100 డిమాండ్‌ చేయడంతో అతడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో డాక్టర్‌ షిండే వంద లంచం తీసుకుంటుండగా ట్రాప్ చేసిన ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసుపై విచారణ జరిపిన ఏసీబీ ప్రత్యేక కోర్టు డాక్టర్‌ షిండే నిర్దోషిగా 2012 జనవరిలో తీర్పు ఇచ్చింది. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును బాంబే హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జితేంద్ర జైన్‌తో కూడిన సింగిల్‌ బెంచ్‌ మంగళవారం ఈ కేసుపై తీర్పు ఇచ్చింది. 2007లో లంచంగా వంద తీసుకోవడం అన్నది చాలా చిన్న విషయమని కోర్టు వ్యాఖ్యానించింది. అవినీతి చట్టంలో కూడా దీని గురించి స్పష్టంగా ఉన్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో వైద్యాధికారి షిండేను నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్‌ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)