త్రిసూర్‌లో ఖుష్బూకు పాదపూజ !

Telugu Lo Computer
0


సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. నిన్న కేరళలోని ఒక ప్రముఖ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఖుష్బూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖష్బు పాదాలు కడిగి మంత్రాలు చదువుతూ అర్చకులు పాదపూజ నిర్వహించారు. ఏటా కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ లో ఒక్కసారి నారీ పూజ నిర్వహిస్తుంటారు. ఈ నారీ పూజలో భాగంగా త్రిసూర్‌లోని ప్రాచీన విష్ణు మాయ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం నారీ పూజలో పాల్గొనే మహిళను ఆ భగవంతుడే ఎంచుకుంటారనేది అక్కడి వారి ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే ఈ ఏడాది పూజలో పాల్గొనే అద్భుతమైన అవకాశం సినీనటి ఖుష్బూ కు అభించింది. ఈ నారీపూజలో భాగంగా ఖష్బును ఒక సింహాసనంపై కూర్చోపెట్టి, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆమె పాదాలు కడిగి ప్రత్యేక పూజలు చేశారు. ఆమె పాదాలను కడిగి బొట్టు పెట్టి.. పూలను, తులసి ఆకులను సమర్పించి పూజలు చేశారు. కనకాంబారాలతో ఆమె పాదాలను అలంకరించి భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. హారతి ఇచ్చి ఖుష్బూను దైవ సమానంగా చూశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకా దీనిపై ఖుష్బూ సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఖుష్బూ దేవుని నుండి దైవిక ఆశీర్వాదం పొందానని పేర్కొన్నారు. త్రిసూర్ లోని విష్ణు మాయ దేవాలయంలో నారీ పూజ చేయడానికి తనను ఆహ్వానించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, ఎంపిక చేసిన వారిని మాత్రమే ఆహ్వానించే ఈ నారీ పూజలో, భగవంతుడే స్వయంగా వ్యక్తిని ఎంపిక చేసుకుంటారని పేర్కొన్నారు. తనకు ఇంతటి గౌరవాన్ని ఆశీర్వదించినందుకు ఆలయంలోని ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక మైన కృతజ్ఞతలని ఖుష్బూ తెలిపారు. ప్రతిరోజు ప్రార్థించే మనల్ని రక్షించే సూపర్ పవర్ ఉందని విశ్వసించే వారందరికీ ఇది చాలా మంచి విషయాలను తెస్తుందని తాను కచ్చితంగా అనుకుంటున్నానని పేర్కొన్నారు. మనందరికీ ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతానని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా, శాంతితో జీవించాలని కోరుకుంటున్నానని ఖుష్బూ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)