ఫోన్ల హ్యాకింగ్‌పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 31 October 2023

ఫోన్ల హ్యాకింగ్‌పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు !


శిథరూర్, మహువా మొయిత్రా, అసదుద్దీన్ ఓవైసీతోపాటు మరి కొందరు విపక్ష ఎంపీలు తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారని, తమకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నట్టు ఆరోపించారు. ఈ ఆరోపణలకు కేంద్రం స్పందించింది. 150 దేశాలకు యాపిల్ సంస్థ అడ్వైజరీ జారీ చేసిందని కేంద్ర ఐటీశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వార్నింగ్ మెసేజ్‌ల విషయంలో సమగ్ర దర్యాప్తుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని, మెసేజ్‌లు అందుకున్నవారితోపాటు యాపిల్ సంస్థ కూడా ఈ దర్యాప్తుకు సహకరించాలని ఆయన కోరారు. కొన్ని సందర్భాల్లో ఆ అలర్ట్‌లు తప్పుగా వచ్చే అవకాశాలున్నట్టు మంత్రి చెప్పారు.విపక్షాలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ విమర్శకులకు ఎటువంటి ఇష్యూ లేని సమయంలో వాళ్లు కేవలం నిఘా గురించి మాట్లాడుతుంటారని వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల క్రితం కూడా వారు ఇదే ప్రయత్నం చేశారని, గతం లోనూ విచారణ చేపట్టామని, న్యాయవ్యవస్థ సూపర్‌విజన్ లోనే ఆ దర్యాప్తు సాగిందని మంత్రి పేర్కొన్నారు. ప్రియాంకా గాంధీ ఇద్దరు పిల్లల ఫోన్లు హ్యాక్ అయినట్టు అప్పట్లో చెప్పారని, కానీ నిజానికి అలా జరగలేదని మంత్రి వెల్లడించారు. కావాలని ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లు మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మంత్రి ఆరోపించారు.

No comments:

Post a Comment