వీసా లేకుండా థాయ్‌లాండ్‌ పర్యటన ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 31 October 2023

వీసా లేకుండా థాయ్‌లాండ్‌ పర్యటన !


భారతీయ పర్యాటకులను దృష్టిలో పెట్టుకున్న థాయ్‌లాండ్‌ ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఆరు నెలల కాలం పాటు వీసా లేకుండా థాయ్‌లాండ్‌ని సందర్శించవచ్చని పేర్కొంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింపజేయడానికి 2023 నవంబర్ 1 నుంచి నుండి మే 2024 వరకు భారత్, తైవాన్ నుండి థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులకు వీసా అవసరం లేదని థాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆరు నెలల కాలం పాటు వీసా లేకుండా థాయ్‌లాండ్‌ని సందర్శించవచ్చని పేర్కొంది. ప్రభుత్వ ప్రతినిధి చైవచరోంకే తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశం మరియు తైవాన్ నుండి వచ్చినవారు 30 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో ఉండేందుకు అనుమతిస్తారు. 2023 వ సంవత్సరంలో 1.2 మిలియన్ల మంది పర్యాటకులతో భారతదేశం పర్యాటకులతో థాయ్‌లాండ్ నాల్గవ అతిపెద్ద మూలాధార మార్కెట్‌గా అవతరించింది. మలేషియా, చైనా , దక్షిణ కొరియా వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి థాయ్‌లాండ్ ఇప్పటికే సెప్టెంబరులో చైనీస్ పర్యాటకులకు వీసాను రద్దు చేసింది. జనవరి నుండి అక్టోబర్ 29 వరకు, థాయ్‌లాండ్‌కు 22 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలోకి తీసుకురావాలని థాయ్‌లాండ్ కొత్త ప్రభుత్వం భావిస్తోంది. థాయ్‌లాండ్ దేశం 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగంలో ఆదాయం పెంచుకొనేందుకు థాయ్‌లాండ్ ... భారత్, తైవాన్ పర్యాటకులకు వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

No comments:

Post a Comment