తగ్గిన బంగారం ధరలు !

Telugu Lo Computer
0


బంగారం ధరలు కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. దసరా, దీపావళి పండుగ సీజన్ కావటంతో ధరలు భారీగా పెరుగుతాయని భావించారు కొనుగోలుదారులు. అందుకు భిన్నంగా 20 రోజుల్లోనే 2 వేల రూపాయల వరకు బంగారం ధర తగ్గటంతో జనం కొనుగోలు కోసం ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం ధరల తగ్గటానికి అంతర్జాతీయంగా నెలకొన్ని ఆర్థిక సంక్షోభం, అమెరికా వడ్డీ రేట్లతోపాటు ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం కూడా కారణం అంటున్నారు ఆర్థిక నిపుణులు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు గణనీయంగా తగ్గడంతో హైదరాబాద్‌లోని నగల దుకాణాల్లో రద్దీ నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,150, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.57,980కి చేరాయి. పసుపు లోహం ధరలు ఆరు నెలల కనిష్టం నుండి 1.04 శాతం పెరిగినప్పటికీ, హైదరాబాద్‌లోని నగల దుకాణాలలో రద్దీ కొనసాగుతోంది. భారత్ పసిడిని దిగుమతి చేసుకున్నప్పటి నుంచి అంతర్జాతీయ కారణాల వల్ల హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గాయి. ఈ క్షీణతకు డాలర్ , అమెరికా వడ్డీతో పాటు ఇజ్రాయోల్ పాలస్తీన మధ్య వార్ కూడా కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే వడ్డీ రేట్లు చాలా కాలం పాటు ఎక్కువగానే ఉంటాయి.. డాలర్ పెట్టుబడిదారులకు ప్రాధాన్య ఆస్తిగా ఉన్నందున..బంగారం ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. మరో వైపు వెండిధరలు స్థిరంగాఉన్నాయి. దేశీయ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 72,100గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ లో కిలో వెండి రూ. 70 వేలుగా ఉంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా బంగారం ధరలు తగ్గుముఖం పడతాయా లేక మళ్లీ పెరుగుతాయా? అనేది చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)