హమాస్‌ను మట్టుబెట్టండి !

Telugu Lo Computer
0


జ్రాయెల్‌-పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులను ప్రముఖ ఇండో అమెరికన్లు తీవ్రంగా ఖండించారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి సహా పలువురు ఇండో అమెరికన్లు ఈ సంక్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు బాసటగా నిలిచారు. ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంలో ఇప్పటికే 1100 మందికి పైగా మరణించారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. 1900 మందికి పైగా గాయాల పాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఖండించిన నిక్కీ హేలీ హమాస్ ఉగ్ర మూకలను మట్టుబెట్టాలని ఇజ్రాయెల్‌ను కోరారు. ఇజ్రాయెల్, అమెరికాకు మరణశాసనం అంటూ హమాస్‌, వారికి వత్తాసు పలికిన ఇరాన్ నినదిస్తున్నాయని, ఇది తమకు గుర్తుంటుందని, హమాస్‌, హెజ్‌బొల్లా, హౌతీస్‌, ఇరానియన్లు తమను ద్వేషిస్తున్నందున తామంతా ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలిచామని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి నిక్కీ హేలీ పేర్కన్నారు. ఇజ్రాయెల్‌కు ఇప్పుడు తమ సంఘీభావం ఎంతో అవసరమని, అందుకే తామంతా ఐక్యంగా ఇజ్రాయెల్ వెన్నంటి ఉంటామని ఆమె పేర్కొన్నారు. హమాస్‌ను మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కోరుతూ నిక్కీ హేలీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)